Earthquake: ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం..! 6 d ago

ప్రపంచంలోని వివిధ దేశాలను వరుస భూకంపాలు వెంటాడుతున్నాయి. మయన్మార్, థాయిలాండ్ లలో సంభవించిన భూకంపం గురించి మరువకముందే ఆఫ్ఘనిస్థాన్ లో స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. అయితే, స్వల్ప వ్యవధిలో రెండు ప్రకంపనల తీవ్రత వరుసగా 4.7, 4.3 గా నమోదైంది. భూకంపం కారణంగా ప్రజలు తమ ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఈ భూకంపాల వలన ఏలాంటి ప్రాణనష్టం లేదని.. ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా ప్రకటించలేదు.